Search for products..

Home / Categories / Collection of Stories /

Raathi Gundelo Neellu

Raathi Gundelo Neellu

per piece




Product details

కథకి చక్కటి ఎత్తుగడ, ఆసక్తికరమైన ముగింపు ప్రాణం పోస్తాయి. అంతా చెప్పేయకుండా కొంత పాఠకుడి ఊహకి వదిలేయాలి. వ్రాసే భాషలో జీవం ఉండాలి. ముఖ్యంగా కథ ఒక జీవిత సత్యాన్ని ఆవిష్కరిస్తూ, సందేశాత్మకంగా ఉండాలి. అప్పుడు పాఠకులు కథతోపాటు తామూ ప్రయాణం చేసి రచయితకు జేజేలు పలుకుతారు.

ఇటువంటి వివిధాంశాలతో కూడుకున్న కథారచన పట్ల ఆకర్షితుడయిన కృష్ణ తనూ కథలు వ్రాయడంపై ఆసక్తి పెంచుకున్నాడు.  

ఏ రచయిత అయినా నిలబడాలంటే సమకాలీన సమాజ జీవితాన్ని తన రచనల్లో ప్రతిబింబించాలి. అదే తన కథావస్తువు కావాలి. ఒకవేళ వస్తువు పాతదే అయినా చెప్పే పద్ధతిలో కొత్తదనం నింపాలి.

కృష్ణ వ్రాసిన కథలలో ఈ లక్షణాలు బాగానే కనిపిస్తాయి. ఇతివృత్తంలో వైవిధ్యం, పాత్రల చిత్రీకరణలో పరిశీలనాత్మకత, పాఠకుడిని చదివింపచేసే రచనా సంవిధానం అతని కథల్లో గమనించగలం.
- చెరుకువాడ సత్యనారాయణ

 

వికృతరూపాన్ని ప్రదర్శించే వ్యవస్థ, విపరీత మనస్తత్వంతో ప్రవర్తించే వ్యక్తులు, నిరాదరణకు గురయ్యే తల్లులు, నానాటికీ సన్నగిల్లుతున్న మానవ సంబంధాలు, ఉన్నంతలో ఉన్నతత్వాన్ని ప్రదర్శించే పాత్రలు, ఆలోచనలు రేకెత్తించే సంఘటనలు, ప్రకృతిని మనం ప్రేమిస్తే అది మనల్ని ఆదరిస్తుందనే ఆశావాదం, మానవత్వాన్ని మాటల్లో కాకుండా చేతల్లో చూపించినప్పుడు కలిగే ఆత్మ సంతృప్తి... ఇలా ప్రతీ కథనూ విలక్షణంగా తీర్చిదిద్దడానికి కృష్ణ పడిన శ్రమ ఆయనకు  ‘కథ’మీదున్న అభిరుచిని, అనురక్తిని స్పష్టంగా తెలియజేస్తుంది. 
- డా. జడా సుబ్బారావు


Similar products


Home

Cart

Account