EarHook Pvt Ltd
108 Startups - Volume I
Per piece
108 startups
సుధీర్ వర్మ తిరుమలరాజు ప్రఖ్యాత కంటెంట్ క్రియేటర్ మరియు వ్యాపారవేత్త. 24 ఏళ్ల వయసులో ఎలాంటి వ్యాపార అనుభవం, సంపన్న కుటుంబం, మేనేజ్మెంట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వంటి అర్హతలు లేకుండా ఒక మధ్యతరగతి కుటుంబం నుండి వ్యాపారం మొదలుపెట్టి, ఏ కళాశాలలోను నేర్పించని జీవిత గుణపాఠాలు వ్యాపారంలో నేర్చుకుని అంచెలు అంచెలుగా ఎదిగి విభిన్న సంస్థలలో నాయకత్వ పదవులు కూడా చేపట్టి ఈ రోజు ఎందరో ఔత్సాహిక వ్యాపారవేత్తలకు బిజినెస్ & స్టార్ట్అప్ అంశాలమీద శిక్షణ ఇస్తూ ప్రణాళిక, ప్రేరణ లేనివారికి దిశానిర్దేశం చేస్తున్నారు.
బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్, జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్, జాగృతి యాత్ర, జోష్ టాక్స్, యూట్యూబ్, టీవి ఛానెల్స్, కోరా డైజెస్ట్, వార్తా పత్రికలలో స్టార్ట్అప్ ముఖ్యాంశాల మీద ఎంతో సమాచారాన్ని అందించి ఉన్నారు. ఇంటర్నెట్ అనలైటిక్స్ ప్రకారం సుమారుగా ఐదుకోట్లమందికి తన కంటెంట్ ని రీచ్ అయ్యేలా చేశారు. మాటలు, శిక్షణ మాత్రమే కాకుండా సాఫ్ట్వేర్ కంపెనీ మరియు బిజినెస్ కన్సల్టింగ్ లో తన వ్యాపారం తాను చేస్తూనే మిగిలిన సమయాన్ని ఇతరులకి వెచ్చిస్తున్నారు.
ప్రయత్నం, ఓటమి లేకుండా జీవితంలో గెలుపు రాదు, ప్రతి ఓటమి గెలుపు కోసమే. ప్రతి గెలుపు విజయం కోసమే. విజయాల సమూహమే చరిత్రలో నిలబడేలా చేస్తుంది అనేది అతని సూత్రం. ఇంటికొక వ్యాపారవేత్త అనే నినాదంతో "అకాడెమీ ఆఫ్ స్టార్ట్అప్స్" సంస్థని మొదలుపెట్టి బిలియన్ డాలర్ల వ్యాపారంతో పాటు మిలియన్ బిలీనీయర్లు కూడా భారతదేశంలో పెరగాలనీ, వ్యాపారం చేసి, ఎగుమతులు పెంచి దేశ ఆదాయం పెంచడం కూడా దేశభక్తి అన్న ఆశయంతో పనిచేస్తున్న స్టార్ట్అప్ చాణక్యుడు. ఈ పుస్తకం కూడా మహిళలు చేయదగ్గ కొత్త ఆలోచనలను అందరికీ అందించాలని, వాటిని ఆచరణలోని తేవాలన్నదే ముఖ్య ఉద్దేశ్యం.