Product details
ఖలీల్ జిబ్రాన్ “ది ప్రొఫెట్” సాంస్కృతిక మరియు భాషా సరిహద్దులను అధిగమించిన ఒక కాలాతీత కళాఖండం. జీవితం, ప్రేమ మరియు మానవ అనుభవంలో దాని లోతైన అంతర్దృష్టులు దాదాపు ఒక శతాబ్దం నుండి ప్రపంచవ్యాప్తంగా పాఠకులతో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి.
జీవితానికి సంబంధించిన 26 అంశాలను ప్రవక్త పాత్ర ద్వారా జిబ్రాన్ వ్యక్తపరచిన శైలి, పదాలు, లోతైన భావాలు ప్రతి పాఠకుని హృదయ తంత్రువులను మీటుతూ, తన వ్యక్తిగత అనుభవాలను ఆలోచనలను సృజిస్తూ హృదయానికి స్వాంతన, ఒక పులకరింత కలిగిస్తాయి.
ప్రతీ కవితకు అనువాదంతో పాటు అనుబంధంగా ‘ప్రవక్త- ప్రబోధాలు’ పేరిట చేర్చబడిన పది ముఖ్యమైన పాఠాలు ప్రతి కవిత పట్ల మరింత స్పష్టత కలిగించి కవి హృదయానికి పాఠకులను దగ్గర చేయడమే కాకుండా అసలు శతాబ్దం గడిచినా జిబ్రాన్ ఎందుకు సజీవంగా ఈ విశ్వ సాహితీ పరిధిలో స్వేచ్చగా తిరుగాడుతున్నాడో స్పష్టమవుతుంది.